మహేష్, కొరటాల శివ మూవీపై మొదలైన విమర్శలు
- December 12, 2016 / 07:10 AM ISTByFilmy Focus
స్టార్ హీరోల సినిమాలు విడుదలైన తర్వాత ఆ స్టోరీ నాది అని కొంతమంది బాధితులు మీడియా ముందు వాపోవడం ఈ మధ్య ఎక్కువైంది. హ్యాట్రిక్ హిట్ డైరక్టర్ కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు కొంతమంది రచయితలు ఆ కథ తమది అంటూ పత్రికల్లో ఎక్కారు. దానిపై డైరక్టర్ స్పందించలేదు. అయితే ఇప్పుడు మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న రెండో మూవీ సెట్స్ మీదకు వెళ్లకముందే దానిపై ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
“భరత్ అను నేను” అనే టైటిల్ రిజిస్టర్ చేసిన ఈ సినిమా కథ కొరటాల శివ రాసింది కాదని, తకిట తకిట సినిమాను తీసిన డైరక్టర్ శ్రీహరి రాసుకున్నది ప్రచారం సాగుతోంది. ఆ కథను కొరటాల కోటి ఇచ్చి కొనుక్కున్నారని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతున్నా కొరటాల మాత్రం నోరు మెదపడం లేదు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత వివాదం చెలరేగుతుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఇప్పుడే డైరక్టర్, కథా రచయిత విషయం పై ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















