కొన్ని నెలల క్రితం యంగ్ హీరో నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా జనాలకు పెద్దగా నచ్చలేదు. అందుకే డిజాస్టర్ అయింది. అయితే నిఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తుస్సుమనిపించింది. టాలీవుడ్ లో నెగెటివిటీ లేని హీరోల్లో నితిన్ ఒకరు. అలాంటిది ఈ సినిమా సమయంలో అతడు బాగా నెగెటివిటీను ఎదుర్కొన్నారు.
దానికి కారణం సినిమా దర్శకుడు శేఖర్. ఎడిటర్ గా సినిమాలు చేసిన శేఖర్.. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో దర్శకుడిగా మారారు. అతడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. గతంలో అతడు ప్రత్యర్థి పార్టీల మీద చేసిన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ సమయంలో హైలైట్ అయి దర్శకుడిగా అతడి తొలి సినిమా మీద విపరీతమైన నెగెటివ్ ప్రచారానికి కారణమయ్యాయి. ఏపీలో జగన్ సర్కార్ మీద వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో శేఖర్ చేసిన పాత కామెంట్స్ మీద దుమారం రేగి సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేసింది.
ఇప్పుడు హీరో విశాల్ సైతం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నట్లుగా కనిపిస్తుంది. రీసెంట్ గా విశాల్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కొనియాడారు. ‘ఐ లవ్ జగన్’ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది టీడీపీ, జనసేన సపోర్టర్స్ కి అసలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడి కొత్త సినిమా ‘లాఠీ’ గురించి బాగా నెగెటివ్ ప్రచారం జరిగింది. జనాల మూడ్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వలనో ఏమో.. ‘లాఠీ’ సినిమాపై ఎఫెక్ట్ పడింది.
విశాల్ గత సినిమాలతో పోలిస్తే.. దీనికి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయింది. దీనిపై పెట్టిన మూడు కోట్ల పెట్టుబడిలో ఇప్పుడు కొంత కూడా వెనక్కి వచ్చేలా లేదు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!