Nene Vasthunna: ‘నేనే వస్తున్నా’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్..!

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ చిత్రం ‘నేనే వస్తున్నా’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో మొదటి నుండి మంచి హైప్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం రిలీజ్ అవ్వగా మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.ధనుష్ డబుల్ రోల్ లో ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు.సెల్వ రాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిలీజ్ కు ముందు ఈ చిత్రం మంచి హైప్ ను సొంతం చేసుకోవడంతో తెలుగులో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 0.75 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.30 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.85 cr

‘నేనే వస్తున్నా’ చిత్రానికి తెలుగులో రూ.1.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.సెప్టెంబర్ 30 నుండి మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ -1’ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. మరి మిక్స్డ్ టాక్ తో ‘నేనే వస్తున్నా’ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus