Geetu: చేపల చెరువు టాస్క్ లో గీతు ఓవర్ యాక్షన్..! టాస్క్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం చేపల చెరువు టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగా మొదటిరౌండ్ లోనే ఆదిరెడ్డి ఇంకా గీతు జంట ఎలిమినేట్ అయిపోయింది. దీంతో సంచాలక్ తదుపరి రౌండ్స్ కోసం వీరిద్దరిని సంచాలక్ గా నియమించాడు. సంచాలక్ గా మారగానే గీతు ఇష్టమొచ్చినట్లుగా రూల్స్ పెట్టింది. చేపల గంపపై పడుకోవడానికి వీల్లేదని, చేతులతో మాత్రమే కాపాడుకోవాలని చెప్పింది. అంతేకాదు, ఇంటి రూల్స్ మర్చిపోయినా కూడా 10 చేపలు మైనస్ చేస్తానంటూ కొత్త రూల్ పెట్టింది. దీంతో రేవంత్ గీతుపై సీరియస్ అయ్యాడు.

నీ ఇష్టమొచ్చినట్లుగా రూల్స్ పెట్టకు, నేను బిగ్ బాస్ చెప్తేనే వింటాను. నువ్వు బిగ్ బాస్ లాగా రూల్స్ పెట్టకు అని చెప్పాడు. అంతేకాదు, వేరేవాళ్ల దగ్గర చేపలు లాక్కుని వాటిని తన దగ్గర పెట్టుకుని లాస్ట్ లో పైకి విసిరేస్తానంటూ చెప్పింది. దీంతో ఆదిరెడ్డి గీతుపై సీరియస్ అయ్యాడు. సంచాలక్ ఎప్పుడైనా గేమ్ ఆడారా అంటూ ప్రశ్నించాడు. సంచాలక్ గా మనం గేమ్ ఆడిస్తూ, రూల్స్ పాటిస్తున్నారో లేదో చూడాలి కానీ, మనమే వెళ్లి గేమ్ ఆడకూడదని చెప్పాడు. దీంతో గీతుకి ఒళ్లు మండిపోయింది.

నా గేమ్ నాఇష్టం మద్యలో నువ్వు రావద్దంటూ ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, చేపల వర్షం కురిసేటపుడు కూడా కొన్ని చేపలని కలక్ట్ చేసింది. మెరీనా దగ్గరనున్న చేపలని సూర్య లాక్కునేటపుడు వెళ్లి మెరీనా దగ్గర్నుంచీ చేపలని గుంజుకుంది. ఇలా తన గేమ్ సంచాలక్ అని పూర్తిగా మర్చిపోయి ప్లేయర్ గా ఆడేసింది. దీంతో బాలాదిత్య ఎంపైర్ బాల్ పట్టుకుని బౌటరీకి వేసినట్లుగా ఉంది నీ ఆట అంటూ సెటైర్ వేశాడు. ఇక గీతు ఈ గేమ్ ని చూసిన ఆడియన్స్ ఛీఛీ గీతు గేమ్ వరెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు గేమ్ లో అందర్నీ టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లుగా ఆడుతోందని,

తన గేమ్ చెడగొట్టుకుని వేరేవాళ్ల గేమ్ కూడా చెడగొడుతోందని అంటున్నారు. అంతేకాదు, గీతు పక్కన ఉండి ఆదిరెడ్డి తన గేమ్ ని కూడా పాడుచేసుకుంటున్నాడని అభిప్రాయపడతున్నారు. గీతక్కా, గీతక్కా అంటూ హౌస్ మేట్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రతి గేమ్ లో గీతు సలహలు ఇవ్వడం అనేది గీతు గేమ్ ని దెబ్బకొట్టేస్తోంది. దీనివల్ల గీతు ఏది చేసినా రైట్ అనే సిట్యువేషన్ లో ఉన్నారు. హౌస్ మేట్స్ అందరూ ఈసారి ఇదే విషయంలో గీతుని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి వీకండ్ నాగార్జున గీతుపట్ల ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus