‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామాయణంలోని మనకు తెలియని కోణాన్ని ఇందులో చూపించబోతున్నట్టు చాలా సందర్భాల్లో తెలియజేసారు. అయితే వాళ్ళు చెప్పినంతలా టీజర్ లేకపోవడంతో అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా డిజప్పాయింట్ అయ్యారు. వీఎఫ్‌ఎక్స్‌ చాలా నాసిరకంగా ఉంది ఆ టీజర్లో.! రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం.. ఇలా ఉందేంటి అనే ఫీలింగ్ కలిగింది. మోషన్ క్యాప్చర్ మూవీ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? దీనికి రూ.500 కోట్ల బడ్జెట్ ఎలా ఖర్చయ్యింది అంటూ బాలీవుడ్ మీడియా సైతం ఏకిపారేసింది.

దీంతో దర్శకుడు ఓం రౌత్ మళ్ళీ ఆ సినిమాకి రిపేర్లు చేయడానికి రెడీ అయ్యాడు. అందుకే 2023 సంక్రాంతి రేసు నుండి ఆ మూవీని తప్పించారు. టీజర్ తో అయినా జాగ్రత్త పడి ‘ఆదిపురుష్’ సినిమాని ఓం చక్కదిద్దితే చాలు అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ గురించి ఎటువంటి వార్త చర్చల్లోకి రాలేదు. అయితే ఈరోజు ప్రశాంత్ వర్మ అనే మిడ్ రేంజ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’ కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.

అందరికీ సుపరిచితుడైన కుర్ర హీరో తేజ సజ్జ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ఇది. ఇందులో విజువల్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. ఈ సినిమా కథ ఏంటి అనేది టీజర్ ద్వారా రివీల్ చేయలేదు కానీ విజువల్ ఎఫెక్ట్స్ తో మెస్మరైజ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఒక రూ.100 కోట్ల మూవీ టీజర్ ను చూసిన ఫీలింగ్ ను కలిగించింది ‘హనుమాన్’ టీజర్. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.30 కోట్ల- రూ.50 కోట్ల మధ్యలో మాత్రమే ఉందని వినికిడి.

దీంతో ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ను ట్యాగ్ చేస్తూ ‘హనుమాన్’ టీజర్ లింక్ ను షేర్ చేసి కొంత మంది నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.మన తెలుగు డైరెక్టర్ ఈ రేంజ్లో తీస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఇంకే రేంజ్ లో తీయాలి.! అలా లేదు కాబట్టే.. ‘ఆదిపురుష్’ దర్శకుడి పై అక్షింతలు పడుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus