Mahesh,Sitara: మహేష్ సితార ఫోటోలపై నెటిజన్ల రియాక్షన్ ఇదే.. ఏమైందంటే?

  • April 13, 2024 / 10:43 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)  సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే సరైన సమయంలో జక్కన్న కచ్చితంగా అప్ డేట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం యూరప్ లో ఉన్నారు. యూరప్ లో మహేష్, సితార దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు బెస్ట్ ఫాదర్.. బెస్ట్ డాటర్ అంటూ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ జుట్టు కూడా పెంచారని రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ కొత్తగా ఉండబోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలుకానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను ఫైనల్ చేయాల్సి ఉంది.

హాలీవుడ్ నటులకు సైతం ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా. విదేశీ లొకేషన్లలో ఈ సినిమాలోని మెజారిటీ సీన్లను షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడు విడుదలైనా రికార్డులు సృష్టించే సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 2026లో విడుదల కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ విదేశీ భాషల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది. స్టార్ హీరో మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus