దేవుడి లుక్ లో పవన్ భలే ఉన్నారుగా.. మరో హిట్ అంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడి రోల్ లో నటించగా ఆ పాత్రకు ప్రశంసలు దక్కడంతో పాటు సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. గోపాల గోపాల మూవీ రీమేక్ మూవీ కాగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న వినోదాయ సిత్తం కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూట్ మొదలుకాగా పవన్ దేవుడి లుక్ లీక్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. దేవుడి లుక్ లో పవన్ ను చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. వినోదాయ సిత్తం రీమేక్ షూటింగ్ ఆరు నెలల్లో పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సముద్రఖని ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

పవన్ తన సినిమాలను వీలైనంత వేగంగా పూర్తి చేసి ఎన్నికల ప్రచారంతో బిజీ కానున్నారు. ఈ సినిమాకు దేవుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. భగవంతుడు, దేవర అనే టైటిల్స్ కూడా ప్రచారంలో ఉండగా ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా కథ, కథనంలో త్రివిక్రమ్ చాలా మార్పులు చేశారని బోగట్టా. వినోదయ సిత్తం చూసిన వాళ్లకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఏకంగా 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండగా ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పవన్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీ కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. పవన్ వరుస విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus