DSP: ఆ తప్పు వల్లే దేవిశ్రీ ప్రసాద్ పై విమర్శలు వస్తున్నాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తను మ్యూజిక్ అందించిన సినిమాల ద్వారా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. రామ్ లింగుస్వామి కాంబో మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా దేవిశ్రీ పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే తాజాగా రిలీజైన ట్రైలర్ లో ఆర్ఆర్ మాత్రం ప్రేక్షకులు ఆశించిన విధంగా లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ సినిమాలకు, సుకుమార్ శిష్యుల సినిమాలకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇతర డైరెక్టర్ల సినిమాలకు అదే స్థాయి క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు.

కీరవాణి విషయంలో కూడా ఈ తరహా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. రాజమౌళి సినిమాలకు మాత్రమే కీరవాణి అద్భుతంగా మ్యూజిక్ ఇస్తారని చాలామంది భావిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ కు గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గుతున్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యతో తెరకెక్కించే సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రౌడీ బాయ్స్ మూవీ మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ నిరాశపరిచాడని దిల్ రాజు ఫీలయ్యారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నెటిజన్ల నెగిటివ్ కామెంట్ల గురించి ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ది వారియర్ మేకర్స్ ఈ సినిమా ఆర్ఆర్ విషయంపై దృష్టి పెట్టాలని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఈ సినిమాకు నష్టం కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ కూడా చాలామంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది. వర్క్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ శ్రద్ధ పెట్టకపోతే ఆయనకు ఆఫర్లు మరింత తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus