హీరో కొడితే విలన్ పరిగెత్తాలి, హీరో తంతే విలన్ గాల్లో బంతిలాగా ఎగిరి నేల మీద పడాలి. ఎంతెత్తు ఎగిరితే హీరోయిజం అంతలా పండినట్లు. ఈ తరహా ఆలోచనలు మన సినిమాల్లో చాలా సార్లు కనిపించాయి, కనిపిస్తున్నాయి… ఇంకా ఆ ఫైట్స్‌కి విజిల్స్ పడేంతవరకు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. పక్క రాష్ట్రాల వాళ్లు ఆ సీన్లు చూసి జోక్స్, మీమ్స్ కూడా వేస్తుంటారు. కానీ మన దర్శక హీరోలు ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకోరు. ఏమంటే మాస్, మాస్ పల్స్ అని ఏవేవో మడత కాజా కబుర్లు చెబుతుంటారు.
అయితే ఇక్కడో మాట… మన సినిమాల్ని మనవాళ్లే విమర్శించుకునే సందర్భాలు ఉన్నాయి. అవి నచ్చకపోయినా అవును నిజమే కదా అనుకున్నాం కూడా. అయితే మన సినిమాల్ని మన హీరోలే తక్కువ చేసి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. కానీ తప్పదు. ఎందుకంటే ఆ మాట ఆల్‌రెడీ అనేశాడు మన బన్నీ. అవును మొన్నీమధ్య వచ్చిన ‘జొమాటో’ యాడ్ చూశారా. దాని గురించి ఇదంతా. అందులో సుబ్బరాజుతో అల్లు అర్జున్ ఫైట్ చేస్తుంటాడు. మరోవైపు రౌడీలంతా గాల్లో ఎగురుతుంటారు.
సుబ్బరాజును గాల్లో ఎగరేసినప్పుడు… నన్ను త్వరగా కింద పడేయవా అని అంటాడు. దానికి బన్నీ ‘ఇది తెలుగు సినిమా కదా… ఇంకాసేపు ఎగరాలి’ అని అంటాడు. అంటే మన తెలుగు సినిమాల్లో ఇలా విలన్లు, రౌడీలు గాల్లో ఎగురుతూ ఉంటారు అని అందరి చెప్పడం బన్నీ ఉద్దేశమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం తెలుగు సినిమా ఎగరాలి అని అన్నాడు అంటున్నారు. బన్నీ ఏ విధంగా అన్నాడో మరోసారి విని చూడొచ్చు.
ఇక ఆ యాడ్ ఎలా ఉంది అనేది చూస్తే… అదో రకంగా ఉంది అనొచ్చు. బన్నీ వాయిస్ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ ఏదో కామెడీ యాడ్‌లా అనిపిస్తోంది అనేవాళ్లూ ఉన్నారు. అయితే బన్నీ స్టయిల్ మాత్రం సూపర్ అంటున్నారు. అయితే ఈ యాడ్‌లో కూడా ‘తగ్గేదేలే’ని వాడుకున్నాడు బన్నీ. అదిరింది కదా బ్రాండ్ ప్రమోషన్.
manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD
— zomato (@zomato) February 4, 2022
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!