Sai Dharam Tej: తేజ్‌ యాక్సిడెంట్‌ విషయంలో నెటిజన్ల ఫైట్‌!

సినిమా వాళ్లంటే అందరికీ ఇష్టమే… అదే సమయంలో అందరికీ లోకువ కూడా. ఎంత ప్రేమ చూపిస్తారో… అందే ద్వేషమూ వెదజల్లుతారు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చూశాం. తాజాగా సాయితేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ విషయంలోనూ ఇలాంటిదే కనిపిస్తోంది. ప్రజలతో కలసి ఉండటానికి పుట్టిన సోషల్‌ మీడియాను… కొంతమంది నెటిజన్లు తమ ద్వేషాన్ని చూపించడానికి వాడుకుంటున్నారు. సాయితేజ్‌ యాక్సిడెంట్‌కి తమదైన భాష్యం చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఇంకొంతమంది వాటికి రంగులు అతికిస్తున్నారు.

సాయితేజ్‌ను శుక్రవారం రాత్రి 8 సమయంలో యాక్సిడెంట్‌ అయ్యింది. వెంటనే సరైన సమాచారం లేక, ఒక్కో మీడియా ఒక్కోలా చెప్పుకొచ్చింది. కాసేపటి సాయితేజ్‌ కుటుంబం నుండి స్పష్టత ఇచ్చారు. ఇంకాసేపటికి ఆయన మావయ్యలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కూడా వచ్చి కంగారేం లేదని చెప్పారు. ఇదిలా జరుగుతుండగా… సాయితేజ్‌ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో తలో మాట వచ్చేసింది. అదలా నాచు పాకినట్లు పాకి… సోషల్‌ మీడియాను కంపు చేసేసింది.

ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు సాయితేజ్‌ ఓవర్‌ స్పీడ్‌తో డ్రైవింగ్‌ చేస్తున్నాడని, ఆ సమయంలో హెల్మట్‌ లేదని, మద్యం సేవించి ఉన్నాడని అంటూ రకరకాల పుకార్లు లేపారు. ఇదే సమయంలో ఈ మూడింటి విషయంలో పోలీసులు స్పష్టతనిచ్చారు. ఇసుక కారణంగా సాయితేజ్‌ బండి స్కిడ్‌ అయ్యిందని చెప్పారు. మద్యం తీసుకోలేదనీ తేల్చారు. అయినా సోషల్‌ మీడియా పుకార్ల షికార్లు ఆగలేదు. ఎప్పుడో జరిగిన దానిని, దీనికి కలిపేస్తూ కామెంట్ల వంటకాలు వండేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోవాలి నెటిజన్లూ… మిమ్మల్నే!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus