Mahesh Babu: మహేష్ మల్టీస్టారర్ల గురించి నెటిజన్లు అలా అన్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. ఇతర స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడం వల్ల విజయాలు దక్కే అవకాశంతో పాటు ఆయా స్టార్ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతోంది. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు ఓకే చెప్పిన మహేష్ బాబు ఈ సినిమాలు మినహా మరే ప్రాజెక్ట్ కు ఓకే చెప్పలేదనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలంటే మరో రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే ఒక ఆన్ లైన్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో నెటిజన్లు మహేష్ బాబు ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లేదా తారక్ లలో ఎవరో ఒకరితో కుదిరితే ఇద్దరితో మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమాలో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఈ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సర్కారు వారి పాట సెకండ్ వీకెండ్ కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఏపీలోని కృష్ణ, నెల్లూరు మినహా మిగిలిన ఏరియాలు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు బ్రేక్ ఈవెన్ కు తక్కువ మొత్తం సాధించాల్సిన పరిస్థితి ఉంది. సర్కారు వారి పాట రిజల్ట్ తో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారనే సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్, మహేష్ జక్కన్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus