Nagarjuna: నెటిజన్ల కామెంట్లను నాగ్ పట్టించుకుంటారా?

స్టార్ హీరో నాగార్జున ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో నాగ్ నటించిన సినిమాలలో సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, బంగార్రాజు సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. నాగ్ నటించి తాజాగా థియేటర్లలో విడుదలైన ది ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో పలు సినిమాలతో హిట్లు అందుకున్న ప్రవీణ్ సత్తారు నాగ్ ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున కూడా ఇతర స్టార్ హీరోలలా రీమేక్ లను నమ్ముకుంటే బెటర్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ హీరోలు రీమేక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. నాగార్జున కూడా ఆ హీరోల బాటలోనే నడిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెటిజన్ల కామెంట్లను నాగార్జున పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నాగ్ మరో ఆరు నెలల వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నాగ్ నటిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ డైరెక్టర్ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని కేవలం నాగార్జున మాత్రం ఈ విషయంలో తడబడుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ ల కోసం ఎలాంటి సబ్జెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి.

నాగార్జునకు టైమ్ బాలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున ఒక్కో సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు నాగార్జునకు క్రేజ్ పెరుగుతోంది. నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని మరి కొందరు సూచిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus