Pushpa Collections: పుష్ప కలెక్షన్లపై నెటిజన్ల కామెంట్లు ఇవే!

  • February 8, 2022 / 08:59 AM IST

గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో పుష్ప ది రైజ్ ను కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టాలు వచ్చినా ఇతర ప్రాంతాలలో మాత్రం ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. హిందీలో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది. అయితే తాజాగా పుష్ప మేకర్స్ ఈ సినిమా 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Click Here To Watch

పుష్ప మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి దూరంగా ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కొంతమంది నిర్మాతలు కలెక్షన్ల పోస్టర్లను ప్రచారం కోసమే వేస్తామని వాస్తవంగా వచ్చిన కలెక్షన్లు తక్కువగా ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే.. పుష్ప ది రైజ్ సినిమాకు ప్రకటించిన కలెక్షన్ల ప్రకారమే నిర్మాతలు పన్నులు కడతారా? అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

పుష్ప ది రైజ్ ఈ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తే ఏపీలో టికెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఏమిటని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా కలెక్షన్ల పోస్టర్ల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు పుష్ప ది రూల్ షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రైజ్ మ్యాజిక్ ను పుష్ప ది రూల్ తో బన్నీ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus