Sreeleela: ఇలాంటి రోల్స్ వల్ల కెరీర్ కు లాభమేంటి.. శ్రీలీలకు అభిమానుల ప్రశ్నలివే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల స్కంద సినిమాలో ఒక హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో ఆమె నటించారు. స్కంద సినిమాలో ఆమె నటించిన సీన్ల కంటే పాటలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి రోల్స్ వల్ల శ్రీలీల కెరీర్ కు లాభం కంటే నష్టం ఎక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల పాత్ర ఆమె అభిమానులను సైతం నిరుత్సాహానికి గురి చేసింది. శ్రీలీలకు గత సినిమాలలో మంచి రోల్స్ దక్కాయని ఈ సినిమాలో మాత్రం మంచి రోల్ దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మరికొన్ని సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. శ్రీలీల బరువు తగ్గడం కూడా ఆమెకు మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత సినిమాలతో పోల్చి చూస్తే శ్రీలీల ఫేస్ లో గ్లో తగ్గిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల పారితోషికం భారీ రేంజ్ లో పెరిగిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

శ్రీలీల తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి. శ్రీలీల ఈ సినిమాలతో సైతం సక్సెస్ సాధించాల్సి ఉంది. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా కెరీర్ విషయంలో ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శ్రీలీల రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శ్రీలీలను (Sreeleela) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. శ్రీలీల ఇకపై కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. శ్రీలీల కెరీర్ మరింత పుంజుకోవాలంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus