స్టార్ హీరో ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. తన బావ ఆయుష్ శర్మ తొలిసారి నటించిన సినిమా కావడంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంది.

ఇందులో సల్మాన్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో ఈ సినిమాను బాయికాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు ఓ రేంజ్ లో సల్మాన్ ను ఆడేసుకుంటున్నాడు. ఓ పక్క సల్మాన్ ఖాన్ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమాను ఏకిపారేస్తున్నారు. దీనికి కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణమని తెలుస్తోంది.

ఎందుకంటే సుశాంత్ డెత్ కేసులో సల్మాన్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపించింది. ఆ కారణంతోనే ఇప్పుడు ఆయన సినిమాను బాయికాట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #BoycottAntim అనే ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ప్రతి నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉన్నాయి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus