సాయిపల్లవి పై వస్తున్న ట్రోలింగ్స్..!

నాగ చైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసినిమాని హృదయానికి హత్తుకునేలా తీశాడని టాక్. ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న ఈసినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని విడుదల చేయబోతోంది హీరోయిన్ సమంత. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ, ఈ సాంగ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫిదాలోని వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే అనే సాంగ్ గుర్తుకొస్తోందట అందరికీ.

సారంగ ధరియా అంటూ సాయిపల్లవి వేస్తున్న చిందులు , వేస్కున్న డ్రెస్సులు చూస్తుంటే అదే పాట గుర్తుకొస్తోంది హైబ్రీడ్ పిల్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నిన్నటికి నిన్న టక్ జగదీష్ నుంచి టీజర్ వస్తే ఇలాగే ఇది అల వైకుంఠపురమలో సిత్తరాల సిరపుడు లాగానే ఉంది కదా అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, అరవింద సమేత వీరరాఘవ సినిమా, మిర్చి సినిమాలు కూడా గుర్తుకు వస్తున్నాయని ఆడుకున్నారు. ఇప్పుడు “లవ్ స్టోరి” చిత్రంలో మూడో పాటగా రాబోతున్న సారంగ ధరియా పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాదు, శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమాలోని స్టెప్పులని, ఈ స్టెప్పులని మ్యాచ్ చేస్తూ సపరేట్ సాంగ్స్ కూడా చేసి మరీ ఆడుకుంటున్నారు. అసలు ఇంతవరకూ సాంగే పూర్తిగా రాలేదు అప్పుడే మీగోల ఏంటి అంటూ సినీ లవర్స్ కౌంటర్ ఎటాక్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సాయిపల్లవి డ్యాన్స్ కి సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. అదీ విషయం.


చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus