అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichander) పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి చాలా కాలం అయ్యింది. తమిళంలో రూపొందే పాన్ ఇండియా సినిమాలకి ఇతను అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. ‘లియో’ (Leo) ‘జైలర్’ (Jailer)’జవాన్’ (Jawan) ఇలా అన్ని సినిమాలకి సూపర్ మ్యూజిక్ అందించాడు రవిచంద్రన్. ఇక్కడి వరకు ఓకే. కానీ ఇతను వేరే భాషల డైరెక్టర్స్ సినిమాలకి పనిచేస్తున్నప్పుడు సరైన మ్యూజిక్ అందించడంలో విఫలమవుతున్నాడు అనేది కొందరి అభిప్రాయం. అందుకు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘దేవర’ (Devara) ఫస్ట్ సింగిల్ అయిన ఫియర్ సాంగ్ ను ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.
ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది అనేది కొందరి వాదన. ఒక రకంగా నిజమే..! ఈ లిరికల్ సాంగ్ కి ఎక్కువ వ్యూస్ ను రాబట్టింది లేదు. ట్యూన్ కూడా ‘లియో’ లోని ‘బడాస్’ సాంగ్ ని పోలి ఉందని ట్రోల్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే అనిరుధ్ ఏదో హడావిడిగా ‘ఫియర్’ సాంగ్ కొట్టేశాడు అని అంటున్నారు.
అనిరుధ్ తెలుగులో ‘దేవర’ కంటే ముందు ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) ‘జెర్సీ’ (Jersey) ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (Nani’s Gang Leader) వంటి సినిమాలకి సంగీతం అందించాడు. అందులో ‘జెర్సీ’ తప్ప ఏదీ హిట్ అవ్వలేదు. ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) కి అనిరుధ్ సంగీత దర్శకుడిగా చేయాలి. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి వల్ల ఆ సినిమాకి తమన్ ను (S.S.Thaman) సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
అనిరుధ్ సంగీతంలో వెస్ట్రన్ టచ్ ఎక్కువగా ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడం లేదు అని కొందరు, తెలుగు భాష పై పట్టు లేకపోవడం వల్ల.. ఇక్కడి దర్శకులతో అతనికి కమ్యూనికేషన్ కుదరడం లేదని.. అందువల్ల అతని నుండి సరైన మ్యూజిక్ రాబట్టుకోవడంలో మన దర్శకులే విఫలమవుతున్నారని మరికొందరు భావిస్తున్నారు.