ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద ట్వీట్ల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తారకరత్న మృతి చెందడంతో చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి తారకరత్న ఇంట్లో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధంగా కనిపించడం బండ్ల గణేష్ కు నచ్చలేదు. చంద్రబాబు, విజయసాయిరెడ్డిలకు రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తారకరత్న చంద్రబాబుకు దగ్గరి బంధువు కాగా తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు కావడంతో తారకరత్నను చివరి చూపు చూడటానికి ఇద్దరూ వచ్చారు.
అయితే బండ్ల గణేష్ చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి కనిపించిన ఫోటోపై విమర్శలు చేయడంతో పాటు షాకింగ్ కామెంట్లు చేశారు. “నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!” అని ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే బండ్ల గణేష్ ట్వీట్ పై విమర్శలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేష్ ట్వీట్ కు చంద్రబాబు అభిమానులు కౌంటర్ ఇస్తూ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. తారకరత్న రెండు కుటుంబాలకు చెందిన మనిషి అని చావు ఇంట్లో కూడా రాజకీయాలు చేయడం ఏమిటని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ట్వీట్లు చూస్తే నీ మీద ఉన్న గౌరవం కూడా పోతుందని చంద్రబాబు అభిమానులు పేర్కొన్నారు.
బండ్ల గణేష్ ట్వీట్ కు ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో బండ్ల గణేష్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అక్కడ సందర్భం వేరు సమయం వేరు అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?