టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఈ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా తన నటనతో మెప్పించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ్ కు జోడీగా నా సామిరంగ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా హ్యాపీ దివాళి అంటూ ఇంగ్లీష్ లో పోస్ట్ చేశారు.
అయితే గతంలో కన్నడలో శుభాకాంక్షలు చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇంగ్లీష్ లో పోస్ట్ పెట్టడంపై కన్నడ నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కన్నడ సినిమాల కంటే ఇతర భాషల సినిమాలకు ఈ బ్యూటీ ప్రాధాన్యత ఇస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆషికా రంగనాథ్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ బ్యూటీ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ కానుకగా నా సామిరంగ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతికి చాలా సినిమాలు రేసులో ఉన్నా నాగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆషికా రంగనాథ్ భవిష్యత్తు పాజెక్ట్ లతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమెకు కెరీర్ పరంగా తిరుగుండదని చప్పవచ్చు. ఆషికా రంగనాథ్ టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆషికా రంగనాథ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఆషికా వివాదాలకు ఛాన్స్ ఇవ్వకూడదని కొంతమంది చెబుతున్నారు.