నేషనల్ అవార్డు విన్నర్ అయిన కీర్తి సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బాల్’ వంటి మంచి హిందీ సినిమాలను తెరకెక్కించిన నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో అతనికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. దిల్ రాజు సమర్పణలో.. ‘వార్త ఎ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో కూడా రూపొందిస్తున్నారు. గతేడాది చివర్లో ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నిర్మాతలు ఆ వార్తలను ఖండించారు. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. దయచేసి అలాంటి వార్తలు నమ్మొద్దని.. వారు చెప్పుకొచ్చారు.నిజానికి జూన్ 3న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశామని.. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల ఆలస్యం అవుతున్నట్టు వారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని జనాలు చాలా వరకు మరిచిపోయారు. కీర్తి సురేష్ గత చిత్రాలు..
‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ వంటివి డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాబట్టి… ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఓటిటిలో విడుదలైనా ప్రేక్షకులు చూస్తారన్న గ్యారెంటీ లేదు. అలాంటిది ఇప్పుడు థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాము అని నిర్మాతలు ప్రకటించారు. అయితే క్రేజ్ మొత్తం పోయిన తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్ కు వచ్చి ప్రేక్షకులు చూస్తారు అన్న గ్యారెంటీ లేదు అని కొంతమంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి.. వాళ్ళ అభిప్రాయం ఎంతవరకు కరెక్టో..!