‘రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థల నుండి వస్తున్న క్రేజీ మూవీ ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ మెయిన్ లీడ్ గా నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ఇది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ రెడ్డి(మేజర్ ఫేమ్), శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.
మే 26న (Mem Famous) ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు వంటి స్టార్ హీరో ఈ చిత్రం బాగుంది అంటూ ట్వీట్ వేశాడు. ఇక సుమంత్ ప్రభాస్ మొదటి సినిమా చేస్తున్నా.. ప్రమోషనల్ స్ట్రాటజీస్ బాగా తెలుసుకున్న కుర్రాడిలా అనిపిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ అన్నిటికీ కూడా అతను దగ్గరుండి ప్రమోట్ చేసిన విధానం బాగుంది. అలాగే స్పెషల్ ప్రీమియర్స్ కు సెలక్టివ్ థియేటర్స్ లో రూ.99 టికెట్ రేట్లు మాత్రమే ఉండటం కూడా ఈ మూవీ పబ్లిసిటీకి బాగా పనికొచ్చింది.
దాదాపు 80 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ స్పెషల్ షోలకి జరిగాయి. టికెట్ రేట్ల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ జనాలను అట్రాక్ట్ చేసిన ఐడియా కూడా హీరోదేనట..! సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకునే సినిమా ఇదే అవుతుంది. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే సుమంత్ ప్రభాస్ కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయే అవకాశాలు ఉన్నాయి.