Samantha: సమంత కొత్త జీవితంలో మరో వ్యక్తి?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా మొన్నటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించుకున్న సమంత విడాకుల తర్వాత మాత్రం ఎవరూ ఊహించని విధంగా అడుగులు వేస్తోంది. ఒక విధంగా తన సినిమా కెరీర్ పై ఆమె సరికొత్త నిర్ణయాలతో మరింత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగచైతన్య నుంచి ఆమె విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా విభిన్నంగా కొటేషన్స్ వధులుతున్న విషయం తెలిసిందే.

అందులో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ఆమె ఇతరులకు అర్థమయ్యేలా చెబుతోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు స్పెషల్ వెకేషన్స్ తో కూడా ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం తన ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టిన సమంత ఇటీవల కెరీర్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆమెకు మేనేజర్ గా నాగచైతన్య కు సంబంధించిన మేనేజర్ కొనసాగిన విషయం తెలిసిందే.

అయితే సమంత ఇటీవల అతనితో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరొక కొత్త మేనేజర్ ని తీసుకున్నట్లుగా టాక్. నాగచైతన్యతో ఎలాంటి లింక్స్ ఉండకుండా పూర్తిస్థాయిలో సమంత వాటన్నిటిని కట్ చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఇక ముంబై లో బిజీ బిజీగా గడుపుతున్న సమంత అక్కడే ఒక ప్రముఖ మేనేజర్ను అపాయింట్ చేసుకుందట. సమంత కు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా అతని ఆదినంలోనే కొనసాగుతాయి అని తెలుస్తోంది.

ఇదివరకే ఆ మేనేజర్ కొంత మంది బాలీవుడ్ ప్రముఖ కూడా మేనేజర్ గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్లో అమెజాన్ ప్రైమ్ నిర్మించబోయే ఒక వెబ్ సినిమా లో నటించబోతోంది. ఆ సినిమాను ది ఫ్యామిలీ మాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించనున్నారు. ఇక తెలుగులో యశోద శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే సమంత రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus