Tollywood: టాలీవుడ్‌లో మొదలైన కొత్త సంప్రదాయం!

సినిమా మొదలు పెట్టి, షూటింగ్‌ చివరిదశకొచ్చినప్పుడు… బిజినెస్‌ డీల్స్‌ మాట్లాడుకుంటుంటారు. కొన్ని పెద్ద సినిమాల విషయానికొస్తే… ఈ డీల్స్‌ ఇంకొచెం ముందుగా ఫిక్స్‌ అవుతుంటాయి. అయితే సినిమా కొబ్బరికాయ కూడా కొట్టకముందే సినిమా బిజినెస్‌ మాట్లాడుకుంటున్నారు. ఇదెక్కడో బాలీవుడ్‌లో కాదు. మన టాలీవుడ్‌లోనే. అలా డీల్స్‌ చేసుకున్న ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరో సినిమా త్వరలో మొదలవుతుంది. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాను జీ సినిమాస్‌ సంస్థ శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాక ముందే ఈ సినిమా డీల్‌ అయిపోయిందట. ఇప్పుడు ఇదే దారిలో పవన్‌ కల్యాణ్‌ – సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమా కూడా డీల్‌ అయిపోయిందట. ఈ సినిమా కనీసం కొబ్బరి కాయ కూడా కొట్టలేదు. ఇంతో డీల్‌ అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి. ఓ విధంగా ఇది టాలీవుడ్‌కి మంచి చేస్తుందనే చెప్పాలి. దీని వల్ల సినిమా నిర్మాణం ఇంకా వేగంగా, సులభంగా అయిపోతుంది అంటున్నారు పెద్దలు.

దాంతోపాటు సినిమాలు కూడా అనుకున్న సమయానికి వచ్చే అవకాశమూ ఉందట. ఎందుకంటే డీల్‌ కుదుర్చుకున్నప్పుడు ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఓ క్లారిటీ తీసుకుంటారు కాబట్టి. టాలీవుడ్‌లో కొత్త సంప్రదాయంగా నిలుస్తున్న ఈ ట్రెండ్‌ను మరికొన్ని సినిమాలు ఫాలో అవుతాయని టాక్‌.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus