NTR, Koratala Siva: ఆ విషయంలో యంగ్ టైగర్ మారక తప్పదా..?

  • June 8, 2021 / 06:47 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకునే హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు పేరుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ ప్లాన్స్ తారుమారవ్వడానికి కారణమవుతోంది. దాదాపు రెండేళ్ల క్రితమే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైనా కరోనా, ఇతర కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో దర్శకధీరుడు రాజమౌళి సైతం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు షిఫ్ట్ అయినట్టు వార్తలు వస్తుండగా ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతోంది. వాస్తవానికి ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించే సినిమాను 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ 2022 ఏప్రిల్ 28న రిలీజవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సుముఖంగా లేరని గతంలో వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, కొరటాల శివ సినిమాకు డేట్లు కేటాయిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఈ విషయంలో తప్పనిసరిగా మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాదే కచ్చితంగా రిలీజ్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus