Allu Arjun, Sukumar: ‘పుష్ప – 2’ అనుకున్న సమయానికి తెస్తారా? తిప్పలు పడతారా?

‘పుష్ప – 1’ విడుదలకు ముందు ప్రచారంలో దర్శకుడు సుకుమార్‌ పెద్దగా పార్టిసిపేట్‌ చేసింది లేదు. మీరు కూడా ఈ విషయం చూసే ఉంటారు. సినిమా విడుదలకు ముందు రోజు జరిగిన ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. రిలీజ్‌ తర్వాత ప్రచారంలో పాలుపంచుకున్నారు. కారణం సినిమా పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వకపోవడమే. కారణాలు ఏవైనా డిసెంబరు 17 నాటికి సినిమా రెడీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నానా ఇబ్బందులు పడి సినిమా అనుకున్న సమయానికి తెచ్చారు.

Click Here To Watch NOW

ఇప్పుడు పార్ట్‌ 2 విషయంలోనూ అదే చేస్తారా? పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. ‘పుష్ప -1’ ప్రచారంలో చిత్ర బృందం చెప్పిన మాట ప్రకారం ‘డిసెంబరు 22, 2022కి పుష్ప పార్ట్‌ 2 తీసుకొస్తాం. ఆ లెక్కన ఈ పాటికి సినిమా షూటింగ్‌ మొదలవ్వాలి. కానీ ఎక్కడా ఆ దాఖలాలు లేవు. చిత్రబృందం ఇంకా కథ మీద కుస్తీలు పడుతోందట. తొలి పార్ట్‌లో వచ్చిన అసంతృప్తులు, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని రెండో పార్ట్‌ను పటిష్ఠంగా సిద్ధం చేయాలని చూస్తున్నారట.

అందుకే అనుకున్న సమయం కంటే ఎక్కువే పడుతోందని టాక్‌. ఏప్రిల్‌ మూడో వారంలో సినిమా మొదలవ్వొచ్చు అని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అది జూన్‌ అవ్వొచ్చు అంటున్నారు. ఒకవేళ జూన్‌లో స్టార్ట్‌ చేసి… పూర్తి స్థాయిలో సిద్ధం చేసి.. ప్రచారం చేసి విడుదల చేయాలంటే నవంబరు మొదటివారానికి సినిమా కాపీ రెడీ అయిపోవాలి. లేదంటే తొలి పార్ట్‌ లాగే సుకుమార్‌ మళ్లీ ప్రచారం మిస్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పాన్‌ ఇండియా సినిమాగా వస్తుండటంతో ఈ సినిమా ప్రచారం కోసం దేశం మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుకుమార్‌ వేగం వేగంగా సినిమా పూర్తి చేయాలి. కానీ సుక్కుకి ఇలాంటి అలవాటు ఎప్పుడూ లేదు. నిదానంగా సినిమా పూర్తి చేసుకుంటూ వస్తారు.దీంతో ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వేగంగా సినిమా పూర్తన్నా చేయాలి, లేదంటే సినిమాను వాయిదా వేసుకోవాలి. ఫ్యాన్స్‌కు మొదటి ఆప్షనే నచ్చుతుంది. మరి లెక్కల మాస్టారు ఏం చేస్తారో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus