ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే.. ఆ చిత్రంలో పాటలు మొదట జనాల్ని ఆకర్షించాలి అని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో పాటలు లేని సినిమాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆ సెంటిమెంట్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కామెంట్స్ చేసిన వాళ్ళు సైతం లేకపోలేదు. అయితే వారి కామెంట్స్ తప్పు అని ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ప్రూవ్ చేసాయి. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ చిత్రానికి పాటలే ప్రధాన బలం అని అందరూ ఒప్పుకోవాల్సిందే. తమన్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలు యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. అంతే కాదు ఇండియా వైడ్ ప్రసిద్ధి చెందిన మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. వీటికి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం టిక్ టాక్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రం మ్యూజికల్ రైట్స్ ను కొనుగోలు చేసిన ఆదిత్య గ్రూప్ అధినేత మాట్లాడుతూ.. ”ముందుగా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఆల్బమ్ మా మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ‘హారికా హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీతా ఆర్ట్స్’ వారికి అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ ఆల్బమ్ లో ఉన్న పాటలు బాలీవుడ్ పాటలను వెనక్కి నెట్టి మరీ జియోసావన్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బమ్స్ లో టాప్ 1, 2 ,6 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు. వీటితో పాటు వింక్, గానా వంటి మ్యూజిక్ ఆప్స్ లో కూడా ఈ పాటల హవానే కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!