టాలీవుడ్ లో ఇన్నాళ్లుగా లేని ఓ కొత్త సంప్రదాయం ఈ ఏడాది కనిపించింది. స్టార్ల సినిమాలు, యంగ్ హీరోల సినిమాల విడుదల తేదీలు ముందుగానే ప్రకటించేశారు. బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే ఈ సంప్రదాయం ఈ ఏడాది టాలీవుడ్‌లో కనిపించింది. గతనెలాఖరున చాలా సినిమాల విడుదల తేదీలు వచ్చాయి. అయితే ఓ నాలుగైదు సినిమాల తేదీలు ప్రకటించలేదు. ఆ తర్వాత వారానికి చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య విడుదల తేదీ తకరారు జరుగుతోంది. దీంట్లో ఎవరు నెగ్గి విడుదల చేస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారనేది తెలియడం లేదు.
వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ సినిమాను జులై 30న విడుదల చేస్తామని రిలీజ్ డేట్ మేలా (జనవరి 29న)లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమాను కూఆ జులై 30న తీసుకొస్తామని చెప్పారు. దీంతో ఆ రోజు రెండు సినిమాలొస్తాయా అనే చర్చ మొదలైంది. మామూలుగా అయితే ఒకే రోజు రెండు సినిమాలు రావడం టాలీవుడ్‌కి కొత్త కాదు. కానీ పాన్ ఇండియా రేంజిలో, అంచనాల మధ్య వస్తున్న ‘రాధే శ్యామ్’తో ‘గని’ ఢీకొంటాడా అనేది చూడాలి.
ప్రభాస్ స్టామినా, రేంజి గతంలో మాదిరిగా ఉండుంటే ఈ పోటీ పెద్ద విషయమే కాదు. ‘బాహుబలి’తో అమాంతం రేంజి పెరిగిపోయింది. మామూలు సినిమా కూడా పాన్ ఇండియా సినిమా రేంజికి మార్చేశారు. మరోవైపు వరుణ్‌తేజ్‌కి ఇంకా అంత హోదా రాలేదు. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు, బాగా చేస్తాడనే అంటున్నారు. ఈ నేపథ్యంలో గని vs శ్యామ్ పోటీలో ఎవరు నెగ్గి సినిమా విడుదల చేస్తారనేది చూడాలి. ఇప్పటివరకు అయితే గనినే వెనక్కి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?