Rajamouli: లేటయ్యేసరికి రోజుకో కొత్త పుకారు.. జక్కన్నగారూ మీరే క్లారిటీ ఇవ్వొచ్చుగా!

ఆలస్యం అమృతం విషం అని అంటారో.. ఆలస్యం విచిత్ర రూమర్లకు కారణం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ మాటలు బాగా వినాల్సిన వాళ్లు రాజమౌళి (S. S. Rajamouli) అండ్‌ కో. ఎందుకంటే మహేష్‌బాబుతో (Mahesh Babu) రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాకు సంబంధించి రోజుకో కొత్త పుకారు పుట్టుకొస్తోంది. అయితే ఏ రెండు పాయింట్లకు పెద్దగా సంబంధం ఉండలేదు. దీంతో ఇవేం పుకార్లురా బాబోయ్‌.. రాజమౌళి గారూ క్లారిటీ ఇవ్వండి ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Rajamouli

మొన్నీమధ్య వరకు ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు షూటింగ్‌ ప్రదేశాల రెక్కీ కోసం ఆఫ్రికా దేశాలు జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో మన దగ్గర ఉన్న జనాలు సినిమా గురించి రోజుకో కొత్త పుకారును పుట్టించే పనిలో ఉన్నారు. తాజాగా కొత్త పాయింట్‌ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబును ఇప్పటివరకు చూడని విధంగా చూపిస్తారు అని టీమ్‌ నుండి వస్తున్న మాటల్ని పట్టుకుని..

ఆ ఇప్పటివరకు చూడని అవతారం ఇదే అంటూ రకరకాల వార్తలు సృష్టించేస్తున్నారు. ఈ సినిమాకు రామాయణంతో కొంతమేర పోలిక ఉంటుందని, సినిమాలో మహేష్ బాబుని రాముడి పాత్రలో చూపిస్తారని చెబుతున్నారు. దీంతో రాముడిగా మహేష్‌ ఎలా ఉంటాడు అంటూ ‘యువరాజు’లోని కృష్ణుడి లుక్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ఈ సినిమా నేపథ్యంగా వారణాసిని ఎంచుకున్నారు ఇటీవల వార్తలొచ్చాయి. ఒకవేళ అదే జరిగితే వారణాసికి రాముని అవతారం ఎలా లింక్‌ చేస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న.

మరోవైపు రాజమౌళి సెర్చింగ్‌ ఇప్పుడు విదేశాల్లో సాగుతోంది. దీంతో సినిమా ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ కంటిన్యూ అవుతుంది, ఎలా జరుగుతుంది అనే డౌట్స్‌ ఎక్కువయ్యాయి. దీంతో సినిమా స్టార్ట్‌ చేసి రాజమౌళి ఆ ప్రెస్‌ మీట్‌ పెట్టాలి అని అభిమానులు కోరుతున్నారు. మరి ఎప్పుడు పచ్చ జెండాలు ఊగుతాయో చూడాలి. ఎందుకంటే ఇంకా కథ కొలిక్కి రాలేదు అంటున్నారు. ఇక కాస్ట్‌ అండ్‌ క్రూ కూడా అదే స్టేట్‌లో ఉందట.

హీరోగా దశాబ్దకాలం పూర్తిచేసుకున్న సాయి ధరమ్ తేజ్..అది మాత్రం రేర్ ఫీట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus