టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (Venkatadri Express) సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) , సరైనోడు (Sarrainodu) , ధృవ (Dhruva) సినిమాలతో క్రేజ్ ను పెంచుకున్నారు. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించి ప్రేక్షకుల్లో ఈ బ్యూటీకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో రకుల్ నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సీక్వెల్ సినిమాలలో రకుల్ నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అంటూ తెరపైకి కొత్త సెంటిమెంట్ వచ్చింద్.
కిక్ (Kick), మన్మథుడు, భారతీయుడు సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలకు సీక్వెల్స్ గా కిక్2 (Kick 2) , మన్మథుడు2 (Manmadhudu 2) , భారతీయుడు2 (Bharateeyudu 2) సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలలో రకుల్ నటించారు. అయితే రకుల్ కు ఈ సినిమాల్లో ఏ సినిమాలో కూడా మరీ భారీ స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు. ఈ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి.
సీక్వెల్ సినిమాలు రకుల్ కు అచ్చిరాలేదని భవిష్యత్తులో రకుల్ కు సీక్వెల్ సినిమాలలో నటించే ఆలోచన ఉంటే కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రంగంలో సెంటిమెంట్లు సాధారణం కాగా ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను రకుల్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రకుల్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రకుల్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ మార్కెట్ కు అనుగుణంగా ఉంది. సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న రకుల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.