Darling Review in Telugu: డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
July 19, 2024 / 12:13 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
ప్రియదర్శి (Hero)
నభా నటేష్ (Heroine)
కృష్ణతేజ, అనన్య నాగళ్ల, విష్ణు (Cast)
అశ్విన్ రామ్ (Director)
నిరంజన్ రెడ్డి - చైతన్య రెడ్డి (Producer)
వివేక్ సాగర్ (Music)
నరేష్ రామదురై (Cinematography)
Release Date : జూలై 19, 2024
“ఇస్మార్ట్ శంకర్”తో (iSmart Shankar) మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయి.. వరుసబెట్టి సినిమాలు చేస్తున్న తరుణంలో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా పెద్ద గ్యాప్ తీసుకొని.. మళ్ళీ తన సత్తా చాటుకొనేందుకు నభా నటేష్ (Nabha Natesh) చేసిన డేరింగ్ అటెంప్ట్ “డార్లింగ్” (Darling) . ఈ చిత్రంలో మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీతో తాను బాధపడుతూ తన భర్తను బాధపెట్టే యువతిగా నభా నటించింది. ఈ చిత్రం ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా అలరించింది. ఈవారం విడుదలైన సినిమాల్లో కూడా “డార్లింగ్” ఒక్కటే చెప్పుకోదగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: చిన్నప్పట్నుండి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్ కి హనీమూన్ వెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న రాఘవ్ (ప్రియదర్శి)కి (Priyadarshi) పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో.. ఆత్మహత్య చేసుకుందామని కొండపైకి వెళ్లగా.. అక్కడ పరిచయమవుతుంది ఆనంది (నభా నటేష్). పరిచయమైన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుంటారు ఇద్దరు.
అయితే.. తాను పెళ్లి చేసుకున్న ఆనందిలో ఆమెకే తెలియని మరికొంత మంది ఉన్నారని తెలిసి బెంబేలెత్తిపోతాడు రాఘవ్. ఈ అరడజను అడ మందతో రాఘవ్ పడిన కష్టాల సమాహారమే “డార్లింగ్”.
నటీనటుల పనితీరు: ఆరేడు వైవిధ్యమైన పాత్రలను తెరపై ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టపడింది నభా నటేష్. ఆనంది, ఆది అనే రెండు కీలకమైన పర్సనాలిటీలు ప్రదర్శినలో ఆకట్టుకున్న నభా.. మిగతా నాలుగు పర్సనాలిటీలను పండించడంలో మాత్రం తడబడింది. ముఖ్యంగా.. పాప & ఝాన్సీ పర్సనాలిటీలను ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టపడింది. అయినప్పటికీ.. ఆమెకు ఉన్న అనుభవానికి, ఆరేడు విభిన్నమైన పాత్రలు పోషించడం అనేది అభినందించాల్సిన విషయం.
ప్రియదర్శి ఒక ఫ్రస్ట్రేటడ్ హజ్బెండ్ గా విశేషంగా ఆకట్టుకున్నాడు. భార్య పెట్టే కష్టాలు భరించలేక బాధపడే సగటు భర్తగా, ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్ని సమస్యలైనా ఎదుర్కొనే యువకుడిగా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైనవాళ్లు మరియు ప్రేమలో ఉన్నవాళ్లు ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు.
అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిన్న పాత్ర అయినప్పటికీ.. పర్వాలేదనిపించుకుంది. కృష్ణతేజ (Krishna Teja), విష్ణు (Vishnu Oi) , మురళీధర్ లు (Muralidhar Goud) కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే.. వారి డైలాగుల్లో అపశృతులు కాస్త ఎక్కువగా దొర్లాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సదరు డైలాగ్స్ వినిపించినప్పుడు కాస్త ఇబ్బందిపడతారు. రఘుబాబు (Raghu Babu), నిహారికలు తమ తమ పాత్రలకు మంచి వేల్యూ యాడ్ చేసారు.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Vivek Sagar) ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి. ఒక్క బార్ సాంగ్ తప్పితే.. మిగతా పాటలన్నీ వివేక్ సాగర్ స్టైల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే నేపధ్య సంగీతంతో కూడా అలరించాడు. ముఖ్యంగా నభా మల్టీపుల్ పర్సనాలిటీలను తన నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశాడు వివేక్ సాగర్.
నరేష్ రామదురై (Naresh Ramadurai) సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ మాత్రం సరిగ్గా సింక్ అవ్వలేదు. జంప్ కట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంకాస్త బెటర్ ట్రాన్సిషన్స్ వాడి ఉంటే బాగుండేది.
దర్శకుడు అశ్విన్ రామ్ (Aswin Raam) “లేడీ అపరిచితుడు” కాన్సెప్ట్ తో “డార్లింగ్” కథను రాసుకున్న విధానం బాగుంది. అసలు భార్యలకి వచ్చే మూడ్ స్వింగ్స్ ను తట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఒక అమ్మాయిలో మల్టీపుల్ పర్సనాలిటీలు ఉండడం అనే కాన్సెప్ట్ తో ప్రెజెంట్ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్న విధానం ఎంగేజింగ్ గా ఉంది. ఫస్టాఫ్ లో ఆ మ్యాడ్ మ్యాక్స్ ఫన్ చాలా చోట్ల వర్కవుటయ్యింది కూడా. అయితే.. సెకండాఫ్ నుండి ఆ స్ప్లిట్ పర్సనాలిటీలను డీల్ చేసిన విధానం మాత్రం బేలగా ఉంది. అంత బాగా ఎస్టాబ్లిష్ చేసిన పాత్రలను చాలా సింపుల్ గా ఒక్కొక్కటిగా నార్మల్ చేసేయడం అనేది మింగుడుపడదు. అయితే.. ప్రియదర్శి పాత్ర ఓపిగ్గా తను ప్రేమించిన అమ్మాయి కోసం కష్టాలన్నీ భరించడం అనేది మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. అందువల్ల.. సెకండాఫ్ లో దొర్లిన తప్పులు ప్రియదర్శి పాత్ర మర్చిపోయేలా చేసింది. అయితే.. సెకండాఫ్ లో క్యారెక్టర్ ఆర్క్స్ సరిగ్గా రాసుకుని ఉంటే మాత్రం సినిమా కచ్చితంగా భారీ విజయం సాధించి ఉండేది. అయినప్పటికీ.. కథకుడిగా, దర్శకుడిగా ఓ మోస్తరు మార్కులతో గట్టెక్కాడు అశ్విన్ రామ్.
విశ్లేషణ: ఈమధ్యకాలంలో మంచి కామెడీ సినిమా చూసి చాలా నెలలవుతోంది. ఈ క్రమంలో విడుదలైన “డార్లింగ్” ఆ లోటు తీర్చేస్తుంది. నభా నటేష్ నట విశ్వరూపం ప్రదర్శన ప్రయత్న లోపాల్ని పట్టించుకోకపోతే.. ప్రియదర్శి పాత్ర, సినిమాలోని హార్మ్ లెస్ కామెడీ & వివేక్ సాగర్ సంగీతం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఫోకస్ పాయింట్: ఈ వీకెండ్ కి మంచి టైమ్ పాస్ “డార్లింగ్”!