Trivikram: త్రివిక్రమ్ కు భారీ టార్గెట్ ఇచ్చిన మహేష్.. సాధ్యమేనా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేష్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాల వల్ల ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ కు సూచించారని బోగట్టా. డిసెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా త్రివిక్రమ్ కు మహేష్ బాబు భారీ టార్గెట్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే సాధారణంగా త్రివిక్రమ్ నిదానంగా సినిమాలు తీస్తారని ఇండస్ట్రీలో పేరుంది. రాజమౌళి సినిమాను వచ్చే ఏడాది జూన్ లో కచ్చితంగా మొదలుపెట్టాల్సి ఉండటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం వచ్చే ఏడాది ఆగష్టు టార్గెట్ గా మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా షూట్ జరగనుందని కొంతమంది చెబుతున్నారు. ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే అధికారక ప్రకటన వస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే ఆలోచన నిర్మాతలకు ఉందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. రాజమౌళి సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం కరెక్ట్ కాదని మహేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత సినిమాలతో మహేష్ బాబు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus