రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలంటే పాజిటివ్ టాక్ కచ్చితంగా రావాలి. అయితే గతంలో ఎన్టీఆర్ సినిమాలు రిలీజైన సమయంలో ఒక పార్టీ బ్యాచ్ ఎన్టీఆర్ సినిమాల గురించి నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ రోజున వాట్సాప్ గ్రూపులలో ఈ తరహా ప్రచారం జరిగింది.
అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఈ తరహా కుట్ర జరగవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి ఎదురైన ప్రశ్నలకు సైతం తారక్ సమాధానాలను దాటవేస్తున్నారు. తన సినిమాలలో కూడా పొలిటికల్ డైలాగ్స్ లేకుండా ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకోవడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ ఒక వివాదం గురించి స్పందించిన సమయంలో ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో ఆ పార్టీ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఊహించని స్థాయిలో మారిపోయాయి. సోషల్ మీడియా హవా పెరిగిన నేపథ్యంలో ఫేక్ ప్రచారాలను సులువుగా తిప్పికొట్టవచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ తప్పు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ మాత్రం తరచూ ఆయనను టార్గెట్ చేస్తుండటం గమనార్హం.