Jr NTR: కొరటాల విషయంలో తారక్ జాగ్రత్త పడాల్సిందే?

ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపించారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ కాంబినేషన్ లో సినిమాపై తెగ ఆసక్తి చూపించారు. అయితే ఆచార్య రిజల్ట్ తో మెగా ఫ్యాన్స్ కంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

Click Here To Watch NOW

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ సోలో హీరో కావడంతో రిజల్ట్ పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా ఆ ప్రభావం పూర్తిగా ఎన్టీఆర్ పైనే పడుతుంది. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటేనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ విషయంలో ముందుకెళ్లాలని షూటింగ్ ఆలస్యమైనా స్క్రిప్ట్ విషయంలో రాజీ పడవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివ ఆచార్య సినిమాతో తొలి ఫెయిల్యూర్ ను ఖాతాలో వేసుకున్నారు.

రొటీన్ కథతో సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలయ్యారు. రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొరటాల శివకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఆచార్య సినిమా ప్రేక్షకులు కొరటాల శివ నుంచి ఆశించే సినిమా మాత్రం కాదు. కొరటాల శివ సైతం ఈ సినిమా విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో ఆత్మ సమీక్ష చేసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఆచార్య ఫలితం గురించి మెగా హీరోలు, కొరటాల శివ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఆచార్య సినిమా ఫలితం ఖరీదైన గుణపాఠం అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి భవిష్యత్తు సినిమాలపై ఆచార్య కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus