Akhanda Movie: బాలయ్య మూవీకి రేట్లు తగ్గించక తప్పదా?

స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా డిసెంబర్ 2వ తేదీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. దీపావళి రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. పాజిటిక్ టాక్ వస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు సాధించవచ్చని సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ప్రూవ్ చేశాయి.

ఏపీలో టికెట్ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేకపోవడంతో స్టార్ హీరోల సినిమాల నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే అఖండ సినిమా హక్కుల రేట్లను తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతను కోరుతున్నారని సమాచారం అందుతోంది. అఖండ ఆంధ్ర హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 12 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను కొన్న రేట్ల కంటే కొంత మొత్తం తగ్గించక తప్పదని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆంధ్ర హక్కులను కూడా తగ్గించిన సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ సినిమాతో బాలయ్య ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు విలన్ గా వరదరాజులు అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus