Chiranjeevi, Rajamouli: చిరంజీవి కోరికకు జక్కన్న ఓకే చెబుతారా?

  • April 23, 2022 / 05:53 PM IST

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తోందనే సంగతి తెలిసింది. చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో చిరంజీవి రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ప్రశంసించారు.

Click Here To Watch NOW

అయితే రాజమౌళి డైరెక్షన్ లో సినిమాను ప్రకటించాలని చిరంజీవి భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవి కోరికకు జక్కన్న ఓకే చెబుతారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జక్కన్న ప్రస్తుతం మహేష్ హీరోగా ఒక సినిమాకు ఓకే చెప్పారు.

సీనియర్ హీరోలతో తనకు కంఫర్ట్ ఉండదని అందుకే సీనియర్ హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి తాను దూరంగా ఉన్నానని రాజమౌళి గతంలో వెల్లడించారు. చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆచార్య సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుంది.

ఆచార్య చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు లభిస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఆచార్య కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 3400 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus