మైత్రి మళ్లీ స్టార్టింగ్ రోజులు గుర్తు చేస్తోంది… ఆ జోరు చూశారా?
- March 27, 2024 / 01:24 PM ISTByFilmy Focus
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఒకప్పుడు టాలీవుడ్‌లో పెద్ద నిర్మాణ సంస్థలు అంటే వినిపించే ఆ నాలుగు లేదంటే ఐదు నిర్మాణ సంస్థల పేర్లు వినిపించేవి. ఆ సమయంలో ముగ్గురు స్నేహితులు కలసి ‘మైత్రి మూవీ మేకర్స్’ అనే బ్యానర్ ఏర్పాటు చేశారు. బయటకు కనిపించేది ముగ్గురు అంటారు కానీ… వెనుక చాలామంది సన్నిహితులు ఉన్నారు అని అంటుంటారు. ఆ విషయం పక్కనపెడితే… ఆ నిర్మాణ సంస్థ వెలుగులు ఆ మధ్య కాస్త తగ్గాయి అని వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు మరోసారి ఆ నిర్మాణ సంస్థ తిరిగి పూర్వపు ఫామ్‌లోకి వచ్చింది. ఫామ్‌లోకి వచ్చింది అంటే.. వరుస విజయాలు అందుకుంటోంది అని అనుకునేరు. ఆ సంగతి త్వరలో తేలుతుంది అనుకోండి. ఇప్పుడు అయితే వరుస సినిమాలు చేస్తూ పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. దీంతో ‘మైత్రి’ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం ఆ నిర్మాణ సంస్థ నుండి కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అది కూడా రామ్‌చరణ్‌తో (Ram Charan) చేస్తుండటంతో ఇది మామూలు అనౌన్స్‌మెంట్ కాదు అని ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.

ఎందుకంటే ఒకే హీరోవి వరుసగా రెండు సినిమాలు ఓ నిర్మాణ భాగమై చేస్తుండటం పెద్ద విషయమే మరి. మైత్రి మూవీ మేకర్స్ నుండి ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం అయితే.. ఆగస్టులో వసతుంది. ఈ సినిమా తర్వాత ఆ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఉంది. దీంతోపాటు తారక్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో మరో సినిమా ఉంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు (Buchi Babu) సినిమా ‘పెద్ది’ (RC16/Peddi) (ప్రచారంలో ఉన్న టైటిల్) నిర్మాణంలో ఈ బ్యానర్ భాగస్వామి.
ఇప్పుడు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రానున్న చరణ్ సినిమాకు కూడా వీళ్లే నిర్మాతలు. ఇక ప్రభాస్ (Prabhas) – హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా కూడా ఈ బ్యానరే తీస్తోంది. ఇవే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మైత్రీ టీమ్ తెరకెక్కిస్తోందని వార్తలొస్తున్నాయి. తమిళంలో అజిత్ (Ajith) సినిమా చేస్తుండగా, హిందీలో బాబీ డియోల్ (Bobby Deol) సినిమా ఉంటుంది అంటున్నారు. మరోవైపు ‘సలార్ 1’(Salaar), ‘హను – మాన్’ (Hanu Man) రిలీజ్ కూడా మైత్రీ వాళ్లే చేశారు. ఇక ఓటీటీలో ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu) లాంటి ప్రయత్నాలు చేసినా సరైన విజయం అందుకోలేదు.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్














