ప్ర‌మోష‌న్ల‌తో అద‌ర‌గొడుతున్న సీతారామం

చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలంటారు. సినిమాల్లోనూ అంతే. చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా భారీ ఎత్తున ప్ర‌మోషన్లు చేయాల్సివ‌స్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌బ్లిసిటీ మ‌రింత అవ‌స‌రం కూడా. ఈ విష‌యంలో ఏ సినిమా ముందుంటే.. ఆ సినిమాకే ఓపెనింగ్స్ వ‌స్తాయి. ఈ విష‌యాన్ని వైజ‌యంతీ మూవీస్ గ్ర‌హించింది. అందుకే `సీతారామం` సినిమాకి ఓ రేంజ్‌లో ప్ర‌మోష‌న్లు క‌ల్పిస్తోంది. దుల్కర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు స్పెష‌లిస్టుగా పేరొందిన హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ర‌ష్మిక ఓ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 5న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర‌బృందం నెల రోజుల ముందు నుంచే ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఒక్కో పాట‌కూ… ఒక్కో ఈవెంట్ చేసింది. ఆ పాట‌ల‌న్నీ హిట్ట‌వ్వ‌డం ఈసినిమాకి మ‌రింత క‌లిసొచ్చింది. ఈ సినిమాలో కాస్టింగ్ కి కొద‌వ‌లేదు. దుల్క‌ర్‌, మృణాళ్‌, ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్‌, సుమంత్‌… వీళ్లంతా ప్ర‌మోష‌న్ల‌లో విరివిగా పాలు పంచుకొంటున్నారు. ఎక్క‌డ చూసినా సీతారామం హంగామానే క‌నిపిస్తోంది. ఏ ఛాన‌ల్ చూసినా వీళ్లే. చిన్న చిన్న యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌లోను కూడా `సీతారామం` హ‌డావుడే ద‌ర్శ‌న‌మిస్తోంది.

హైద‌రాబాద్‌తో పాటుగా విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంల‌లో సీతారామం ఈవెంట్లు జ‌రిగాయి. ఈ ఈవెంట్ల‌కు వ‌చ్చిన క్రౌడ్ ని చూస్తే మ‌తి పోతోంది. ఇప్ప‌టికే పాట‌లు ప్ర‌చార చిత్రాల‌తో ఈ సినిమా చూడాలన్న ఉత్సుక‌త‌ని పెంచేసింది చిత్ర‌బృందం. ఇప్పుడు ప్ర‌మోష‌న్ల‌తో వాటిని రెట్టింపు చేస్తోంది. ఈనెల 5న సీతారామంతో పాటుగా `బింబిసార‌` కూడా విడుద‌ల అవుతోంది. అది కూడా పెద్ద సినిమానే. అయితే బింబిసార‌తో పోలిస్తే.. సీతారామం ప్ర‌మోష‌న్లే ఘ‌నంగా క‌నిపిస్తున్నాయి. ఈర‌కంగా… బింబిసార‌పై సీతారామం పై చేయి సాధించింద‌నే చెప్పాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus