‘నిధి అగర్వాల్ తో చీప్ గా ప్రవర్తించిన డైరెక్టర్’.. అంటూ విమర్శలు..!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ‘సవ్యసాచి’ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా నటించింది. అయితే 2019 లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతోనే ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్రంలో ఈమె.. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. దాంతో ఈమెకు టాలీవుడ్ నుండే కాకుండా కోలీవుడ్ నుండీ కూడా భారీ ఆఫర్లు దక్కుతున్నాయి.

ఇదే క్రమంలో.. ఈమె తమిళ స్టార్ హీరో శింబు నటిస్తున్న ‘ఈశ్వరన్’ మూవీలో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ ను ఇటీవల నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ క్రమంలో ‘ఈశ్వరన్’ దర్శకుడు సుశీంద్రన్.. స్టేజి పై మాట్లాడుతున్న నిధి వద్దకు వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఓ పక్కన ఆమె సినిమా గురించి.. అలాగే అందులో ఆమె పాత్ర గురించి నిధి మాట్లాడుతుంటే.. దర్శకుడు సుశీంద్రన్ మధ్యలో వచ్చి ‘శింబు మావా ఐ లవ్ యు’ అని శింబుని పిలవాలంటూ నిధి అగర్వాల్ ను ఇబ్బంది పెట్టాడు.

ఆ టైములో నిధి.. ఆ టాపిక్ ను డైవర్ట్ చెయ్యాలని ట్రై చేసింది. అయినప్పటికీ సుశీంద్రన్ వినిపించుకోలేదు. దీంతో సుశీంద్రన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అయితే ‘నిధిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తాను ఇలా అనలేదని..! సినిమాలో ఆమె క్యారెక్టర్ శింబుతో బెహేవ్ చేసే విధానాన్ని ప్రేక్షకులు పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఆ టైములో నిధితో అలా చెప్పినట్టు’ సుశీంద్రన్ క్లారిటీ ఇచ్చాడు. అయినా అతని పై ట్రోలింగ్ ఆగలేదనే చెప్పాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus