Nidhhi Agerwal: స్టార్‌ హీరోతో నిధి అగర్వాల్‌ ప్రేమలో పడ్డారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా హరిహర వీరమల్లు అనే మూవీలో నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో జోరుమీదున్న నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమాతో మరో సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో మరింత ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే వస్తాయని చెప్పవచ్చు. అయితే త్వరలో ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన శింబు మానాడు సినిమాతో సక్సెస్ సాధించారు. ఈ సినిమా కోసం శింబు బరువు తగ్గడంతో పాటు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. అయితే ఈ హీరోతో నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈశ్వరన్ మూవీలో శింబు, నిధి కలిసి నటించగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిధి, శింబు ప్రేమలో పడ్డారని సమాచారం.

ప్రస్తుతం నిధి అగర్వాల్ చెన్నైలోని శింబు ఇంట్లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. నిధి అగర్వాల్ లేదా శింబు క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్త నిజమో కాదో తెలిసే ఛాన్స్ ఉంటుంది. శింబు, నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. నిధి అగర్వాల్, శింబు మధ్య వయస్సు పరంగా పది సంవత్సరాల తేడా ఉంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు సినిమాలు ఉండగా నిధి అగర్వాల్ కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో బాగానే సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

కోలీవుడ్ మీడియాలో శింబు, నిధి అగర్వాల్ పెళ్లి వార్త హాట్ టాపిక్ అయింది. మానాడు సినిమా తెలుగులో లూప్ పేరుతో డబ్ అయ్యి సోనీ లివ్ యాప్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా తెలుగులో రానా హీరోగా రీమేక్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus