గల్లా అశోక్ సినిమా కోసం భారీగానే తీసుకుంటుంది..!

గతంలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంతను తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికి సమంత పెద్ద స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. కాబట్టి ఓ కొత్త కుర్రాడి సినిమాలో నటించడానికి 2 కోట్ల వరకూ పారితోషికం తీసుకుందని వార్త అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటూ గా అదే సీన్ రిపీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే… మహేష్ బాబు మేనల్లుడు… గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం నిధి ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అడిగిందట. అయితే దానిని కోటికి ఫైనల్ చేశారట నిర్మాతలు. అయితే నిధి మొదటి రెండు చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి.. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయినప్పటికీ.. ఆ సినిమాలో ఎక్కువ క్రెడిట్ నభా నటేష్ కొట్టేసింది. అయినప్పటికీ ఎందుకు ఈమెకు అంత చెల్లిస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఈ భామకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక హీరో అశోక్ పక్కన కూడా ఈమె కరెక్ట్ గా సరిపోతుందని భావించి… నిర్మాతలు ఈమెను తీసుకున్నట్టు తెలుస్తుంది.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus