Niharika: నువ్వు ప్రశాంతంగా ఉంటున్నందుకు థాంక్యూ.. భర్త పై నిహారిక కామెంట్స్..!

పలు వెబ్ సిరీస్ లతో కెరీర్ ను మొదలు పెట్టిన మెగా డాటర్ నిహారిక అటు తర్వాత ‘ఢీ’ వంటి షోలకు మెంటర్ గా వ్యవహరిస్తూనే … ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.నాగశౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో ఈమె నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు కూడా నిరాశపరిచాయి.

ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ ల బాట పట్టింది. అయితే 2020 చివర్లో చైతన్య జొన్నలగడ్డ ని వివాహం చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ మధ్య కాలంలో నిహారిక ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం, అటు తర్వాత పోలీసులు రైడ్ చేసిన పబ్ లో ఆమె దొరకడం,ఆ పబ్ లో నిహారిక డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు నిహారిక పై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఆమె తన భర్తతో దూరంగా ఉంటుంది అంటూ కొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ అవి అవాస్తవాలు అని తేలిపోయింది.మరోపక్క ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. వాటి పై ఆమె క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఈ రోజు నిహారిక భర్త చైతన్య 32వ పుట్టినరోజు కావడంతో తన భర్తకు స్వీట్స్ పెట్టి స్వీటెస్ట్ విషెస్ చెప్పింది నిహారిక. ‘హ్యాపీ బర్త్ డే చెయ్.. నా కూలెస్ట్ కుకుంబర్.నీ క్రేజీ నెస్ కి, నువ్వు ప్రశాంతంగా ఉంటున్నందుకు థాంక్యూ. లవ్ యు బేబీ అంటూ ఓ క్యూటెస్ట్ వీడియోను షేర్ చేసింది నిహారిక.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus