Niharika: తెరపైకి మళ్ళీ మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం!

మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను 2020 డిసెంబర్ 9 న పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలం ఈ జంట బాగానే కలిసింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు సంభవించాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు పుట్టుకొచ్చాయి. మధ్యలో నిహారిక పోలీసులు రైడ్ చేసిన ఓ పబ్బుల్లో దొరకడం, అటు తర్వాత ఆమె కొంతకాలం ఇన్స్టాగ్రామ్ కి ధురమవ్వడంతో.. ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టు .. అయ్యింది. కానీ అటు తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

నిజానికి అవి పుకార్లే అయ్యుంటాయని అంతా ఆ వార్తలను లైట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే చైతన్య – నిహారిక ల విడాకుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దానికి కారణం ఇన్స్టాగ్రామ్ లో వీరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే ఇద్దరూ తమ ఖాతాల్లో తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకోవడం వల్లనే అని చెప్పాలి. అంతేకాదు నిహారిక తో దిగిన ఒక్క ఫోటో కూడా చైతన్య అకౌంట్ లో లేదు. మెగా ఫ్యామిలీలో చైతన్య అందరినీ ఫాలో అవుతున్నాడు నిహారిక ని తప్ప. దీంతో వీరు ఈసారి కచ్చితంగా విడాకులు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్టు చర్చలు జరుగుతున్నాయి.

మరోపక్క 2024 ఎన్నికలు అయ్యేవరకు వీరిని విడాకులకు అప్లై చేయొద్దు అని కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ప్రత్యర్థి పార్టీకి వీరి జనసేన పార్టీ పర్సనల్ విషయాలపై టార్గెట్ చేసి అల్లరి చేసే అవకాశాలు లేకపోలేదు. పైగా నాగబాబు జనసేన పార్టీలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు. వీరిలానే కళ్యాణ్ దేవ్ – శ్రీజ ల విడాకుల వ్యవహారం బయట పెట్టకపోవడానికి.. కూడా కారణం అదే అని తెలుస్తుంది.

విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus