Niharika: తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని డిలీట్ చేసి షాక్ ఇచ్చిన నిహారిక..!

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నిహారికకి ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎక్కువగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది నిహారిక. అప్పుడప్పుడు ఆమె చూసిన కొత్త సినిమాల గురించి కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

అలాంటి నిహారిక సడెన్ గా తన ఇన్స్టా ఖాతాని డిలీట్ చేసింది. ఆమె ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడం పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె పెట్టిన ఓ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆమె ఇలా డెసిషన్ తీసుకుందని కొందరు అంటుంటే, ఆమె ప్రైవేట్ లైఫ్ ను డిస్టర్బ్ చేసే విధంగా కామెంట్లు వస్తున్నాయని, అందుకే నిహారిక ఈ బోల్డ్ డెషిషన్ తీసుకుందని మరికొందరు అంటున్నారు. నిహారిక మాత్రం ఈ విషయం పై స్పందించలేదు.

ఇక బుల్లితెర పై పలు షోలలో పాల్గొని సందడి చేసిన నిహారిక… తర్వాత ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ చిత్రంలో మంచి నటన కనపరిచినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు రాలేదు. తర్వాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు వెబ్ సిరీస్ లను తలపించడంతో ప్రేక్షకులు వాటిని ఆదరించలేదు. ‘సైరా’ సినిమాలో నిహారిక నటించినా.. అందులో ఆమెది గుర్తుంచుకునే రేంజ్ పాత్ర కాదు.

కనీసం ఆ సినిమాలో ఆమెకు డైలాగులు కూడా ఉండవు. సినిమాలు తనకి సెట్ కావు అని భావించి మళ్ళీ వెబ్ సిరీస్ ల బాట పట్టింది. కొన్నాళ్ళకి అవి కూడా వదిలేసింది. 2020 లో చైతన్య జొన్నలగడ్డని పెళ్ళి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది నిహారిక.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus