Niharika: టర్కీ వెకేషన్ లో మెగా డాటర్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన నిహారిక పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా వర్కౌట్ కాకపోవడంతో ఈమె ఇండస్ట్రీకి దూరమై వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నటువంటి నిహారిక తరచూ వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె టర్కీ వెకేషన్ వెళ్లారు. టర్కీఅందాలను తిలకిస్తూ. టర్కీలోని జెరోమె, కప్పకోడియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక అక్కడ పారాచూట్ పై సందడి చేస్తూ పారాషూట్ నుంచి టర్కీ అందాలను వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా నిహారిక ఒకవైపు కెరియర్ లోను,మరోవైపు వ్యక్తిగత జీవితంలోను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో నిహారిక ఫోటోషూట్ లు పలు విమర్శలకు దారితీస్తున్నాయి.గత కొద్ది రోజుల క్రితం ఈమె అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులకు ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే పబ్ ఘటన తరువాత నుంచి నిహారికను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఈమె ఎలాంటి పోస్ట్ చేసిన నేటిజన్ల నుంచి భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

1

2

3

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus