Niharika: ఆ రీజన్ వల్లే తమిళ్ లో ఎక్కువ సినిమాలు.. నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో నిహారిక (Niharika) ఒకరు. ఒకవైపు నటిగా మరోవైపు నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్న నిహారిక రెండు రంగాలలో సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన కెరీర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానో అంతవరకు గ్లామర్ షో చేస్తానని ఆమె తెలిపారు.

అంతే తప్ప స్కిన్ షో కోసం గీత దాటనని ఆమె చెప్పుకొచ్చారు. నాకు ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు స్కిన్ షో చేయడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు. యాక్టింగ్ కెరీర్ విషయంలో తాను సీరియస్ గానే ఉన్నానని నిహారిక వెల్లడించారు. నేను యాక్టింగ్ విషయంలో సీరియస్ గా ఉన్నానని ఇండస్ట్రీలో తెలియదనుకుంటానని నిహారిక చెప్పుకొచ్చారు. మెగా కుటుంబానికి చెందిన అమ్మాయిని కావడంతో చాలామంది నేను స్క్రిప్ట్ లకు నో చెబుతానని భావించి నన్ను సంప్రదించడం లేదని నిహారిక పేర్కొన్నారు.

నా వెనుక చాలా పవర్స్ ఉన్నాయని వాళ్ల భయమని అందుకే తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్నానని నిహారిక తెలిపారు. నేను హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తానని చాలామంది ఫీలవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే 5 నిమిషాల పాత్ర అయినా చేస్తానని నిహారిక క్లారిటీ ఇచ్చారు. నేను నటించే సినిమాలకు సంబంధించిన కథలను నేను మాత్రమే వింటానని ఆమె పేర్కొన్నారు.

నిహారిక నిర్మాతగా కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిహారిక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. నిహారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus