Niharika: మెగా డాటర్ నిహారిక లిప్ లాక్ ఫొటో వైరల్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఇటీవలకాలంలో చాలా భిన్నంగా ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఆ మధ్య హైదరాబాద్ పబ్ లకు సంబంధించిన కేసు విషయంలో నిహారిక పేరు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తర్వాత ఆ కేసుకు సంబంధించి నిహారిక కు ఎలాంటి సంబంధం లేదు అని నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికి ఆ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అయితే నిహారిక మధ్యలో కొన్ని ట్రోల్స్ రావడం వలన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె ఇలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా పెట్రోల్ అవడంతో బాగా అసహనం వ్యక్తం చేసింది ఇక మళ్ళీ తన జీవితం గురించి చాలా నేర్చుకున్నాను అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా నామీద ట్రోలింగ్ ఏమాత్రం తగ్గలేదు ఇంకా అవన్నీ పట్టించుకోకుండా నిహారిక ఎప్పటిలానే ముందుకు సాగుతోంది.

ఆమె ప్రస్తుతం తన భర్తతో కలిసి జోర్డాన్ హాలిడేస్ కి వెళ్ళిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె మొదటి సారి లిప్ లాక్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకోవడం విశేషం. తన భర్త చైతన్యకు లిప్ లాక్ ఇచ్చిన ఫొటోను బ్లర్ చేసి పోస్ట్ చేసింది. ఫరెవర్ బాండ్ అంటూ ఆమె చాలా ఎమోషనల్ గా ఎమోజీని కూడా షేర్ చేసింది. తన భర్తపై నిహారిక అమితమైన ప్రేమను చూపిస్తున్నట్లుగా అర్థం అయ్యింది.

గతంలో వీరి మధ్య విబేధాలు వచ్చినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో ఎలాంటి నిజం లేదని మరోసారి తన ప్రేమను ఇలా షేర్ చేసుకుంది. ఇక ఆ ఫోటో పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారిపోయింది. ఇక నెటిజన్స్ కూడా ఈ ఫొటో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus