Niharika: డొంకతిరుగుడు లేకుండా ఓపెన్ అయిపోయిన నిహారిక..!

మెగా డాటర్ నిహారిక కెరీర్ ప్రారంభంలో బుల్లితెర పై ఢీ వంటి షోలలో మెంటర్ గా వ్యవహరించి అటు తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక అటు తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. తమిళంలో కూడా ఓ సినిమాలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. తన పెదనాన్న చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా నటించింది. ఇన్ని సినిమాల్లో నటించినా ఈమె ప్రేక్షాదరణకి నోచుకోలేదు. ‘హీరోయిన్ అంటే గ్లామర్ షో చేయాలి..

కానీ నేను పాటించే నిబంధల వల్ల అది చేయలేను’ అంటూ ఈమె చెప్పి సినిమాల నుండీ సైడ్ అయ్యిపోయింది. తర్వాత ఈమె పెళ్ళి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.అయితే తనకి కలిసొచ్చిన వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ఈమె ఎప్పుడూ సిద్దమే అంటుంది. ఇదిలా ఉండగా… ఇటీవల ఈమె ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొంది. ఇందులో నిహారికకి పెళ్లి, సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ముఖ్యంగా పెళ్లైయ్యాక సినిమాలకి దూరంగా ఉన్నారు ఎందుకు? అని ఆలీ.. నిహారికని ప్రశ్నించాడు దీనికి నిహారిక..”మా ఆయనకి నేను సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. అందుకే మానేశాను.

అయినా ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్ళయినంత మాత్రాన హీరోయిన్ ఇమేజ్ లో ఎటువంటి మార్పు వస్తుందంటే నేను నమ్మను. సమంతకి పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్ళైన తర్వాత కూడా అంతే క్రేజ్ ఉంది. మా అయన జస్ట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించొద్దు అన్నారు.అంతే కానీ టీవీ, వెబ్ సిరీస్, యూట్యూబ్ వంటి వాటికి పరిమితులు పెట్టలేదు. ఒకవేళ మంచి పాత్ర వస్తే మా ఆయన్ని అడిగి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus