ఒక తమిళ సినిమాపై మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ ఎఫెక్ట్ చూపించింది. ఆమె పెళ్లి వల్ల వాళ్ళు కొత్త కథానాయికను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వివరాల్లోకి వెళితే… మెగా బ్రదర్ నాగబాబు నిహారిక నిశ్చితార్థం కొన్ని రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరగడానికి కంటే ముందు ఆమె ఒక తమిళ సినిమాకు సంతకం చేశారు. దానికి బల్క్ డేట్స్ ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల షూట్ చెయ్యడం కుదరలేదు. షెడ్యూల్స్ అన్ని రీషెడ్యూల్ చెయ్యాల్సి వస్తోంది.
మ్యారేజ్ వల్ల ఆ సినిమా చెయ్యలేనని నీహారిక తప్పుకొన్నారు. అశోక్ సెల్వన్ కథానాయకుడిగా సుశీంద్రన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన స్వాతిని దర్శకత్వం వహించనున్న సినిమాలో మొదట నిహారికను కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలోకి మేఘా ఆకాష్ వచ్చి చేరారు. నిర్మాత సెల్వ కుమార్ ఈ సంగతి చెప్పారు. “నిహారిక చాలా ప్రొఫెషనల్. ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి ఆమె పర్ఫెక్ట్ అని డైరెక్టర్ ఫీల్ అవ్వడంతో సినిమాల్లోకి తీసుకున్నాం. నిహారిక కూడా బల్క్ డేట్స్ ఇచ్చారు.

మ్యారేజ్ కి ముందు సినిమాను కంప్లీట్ చెయ్యాలనుకున్నారు. దురదృష్టవశాత్తు కరోనా సమస్యల వల్ల చెయ్యలేకపోయాం. షెడ్యూల్ మానేజ్ చేయడానికి నిహారిక ట్రై చేసారు కాని కుదరలేదు” అని సెల్వ కుమార్ తెలియజేశారు. అక్టోబర్ నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారట. నిహారిక పెళ్లి ఇయర్ ఎండింగ్ లేదా 2021 స్టార్టింగ్ లో జరగవచ్చని సమాచారం.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: బిగ్‌బాస్ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!
