ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి మాత్రం పోస్ట్ పోన్ చేసుకొను

  • March 17, 2020 / 11:12 AM IST

ఒకపక్క కరోనా కారణంగా వేలాది మంది చనిపోతున్నారు, లక్షల మంది వైరస్ సోకి ఆసుపత్రి పాలవుతున్నారు. కోట్ల మంది ఈ వైరస్ ఎక్కడ తమకు సోకుతుందో అని భయపడిచస్తున్నారు. దేశాలు, ప్రభుత్వాలు ఈ వైరస్ నుండి ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని తలలు పట్టుకొంటున్నారు. అదృష్టం కొద్దీ మన భారత్ ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడం లేదనుకోండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేదనే చెప్పాలి. అయితే.. ఈ కరోనా కాదు కదా ఏమోచ్చినా ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లి మాత్రం ఆగదు అంటున్నాడు నిఖిల్.

ఒకసారి జరగాల్సిన పెళ్లి కేవలం మాటల దాకా వచ్చి ఆగిపోవడంతో.. రెండోసారి ప్రేమించి పెళ్లి చేసుకొంటున్న నిఖిల్ గత నెలలోనే తన జీవిత భాగస్వామిని అందరికీ పరిచయం చేశాడు. అయితే.. ఈ కరోనా కారణంగా పెళ్లి ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలున్నాయా అని ప్రశ్నించగా “ఏం జరిగినా పెళ్లి మాత్రం ఆగదు” అని క్లారిటీ ఇచ్చాడంట. ఎలాగూ సెలబ్రిటీ వెడ్డింగ్ అంటే పరిమిత బంధువులు, స్నేహితులు ఉంటారు కాబట్టి పెద్ద సమస్య ఉండదనుకుంటా. మరి ఈ మ్యారేజ్ టైమ్ కి ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గిపోతే పర్లేదు కానీ.. లేదంటే పెళ్లికొచ్చేవాళ్ళందరూ మాస్క్ లు పెట్టుకొని, చేతిలో సానిటైజర్లు పట్టుకొని అటెండ్ అవ్వాల్సిందే.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus