Nikhil: అమిత్‌ షా పిలిచారు.. కలవకపోవడానికి కారణమిదే: నిఖిల్‌

ఆ మధ్య కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌ వచ్చినప్పుడు యువ హీరో నితిన్‌ను కలిశారు. ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు అంటూ చిన్నపాటి చర్చ జరిగింది. అసలు నితిన్‌ ఎందుకు కలిశాడు, ఏమైనా రాజకీయాల్లోకి వస్తాడా అనే చర్చ కూడా సాగింది. నితిన్‌ తండ్రి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారని వార్తలొచ్చాయి కూడా. అయితే రెండు రోజులకే చర్చంతా వేరే వైపు వెళ్లిపోయింది. అసలు అమిత్‌ షా కలవాలని అనుకున్నది నితిన్‌ను కాదని, నిఖిల్‌ని అని వార్తలొచ్చాయి.

దీంతో అసలేమైంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీనిపై క్లారిటీ కోసం చాలా రోజుల నుండి తెలుగు మీడియా, తెలుగు ప్రజలు వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా ‘స్పై’ సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ విషయం మీద నిఖిల్‌ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని వెళ్లలేదని నిఖిల్‌ చెప్పుకొచ్చారు. అయితే తనను ఆహ్వానించినందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

నిఖిల్‌ (Nikhil) కథానాయకుడిగా గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘స్పై’. సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం చిత్రం చూస్తే అర్థమవుతోంది. అప్పుడే అమిత్‌ షా విషయం కూడా చెప్పుకొచ్చారు నిఖిల్‌. దీంతోపాటు మరకొన్ని విషయాలపై నిఖిల్ స్పష్టత ఇచ్చారు. కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’, ‘స్పై’ రెండూ కథలు ఒకటేనని అంటున్నారు కానీ.. రెండూ డిఫరెంట్‌ స్టోరీలు అని క్లారిటీ ఇచ్చాడు.

కల్యాణ్ రామ్ ‘డెవిల్‌’ సినిమా కూడా సుభాష్ చంద్రబోస్ మీదే వస్తుందనే విషయం తెలిసింది. దీంతో మేం వాళ్లతో మాట్లాడాం. ఈ రెండు సినిమాలకూ ఎలాంటి సంబంధం లేదని అర్థమైంది. అలాగే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి పొలిటికల్‌ జెండాలు, అజెండాలు కూడా లేవని చెప్పేశాడు. నేను ఏ పార్టీకీ అనుకూలంగా సినిమాలు తీయడం లేదు. ఒక భారతీయుడిలా ఈ సినిమా చేస్తున్నా అని కూడా చెప్పారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus